WGL: చౌరస్తాలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఓ షాప్‌పై నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 860 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,30,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో షాప్ యజమాని రాజ్ పురోజ్ భవాని సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.