ATP: గుత్తి మండలంలోని లచ్చానుపల్లికి గురువారం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారుల బృందం రానున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ తెలిపారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. కేంద్ర బృందం గ్రామానికి వచ్చి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, ఇంటి పన్నులు, పారిశుధ్యం, మహిళ సంఘాల సమాచారం తదితరాలపై అధ్యయనం చేయనున్నారన్నారు. ప్రజలు పంచాయతీరాజ్ అధికారులకు సహకరించాలని కోరారు.