MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ బొట్ల అనిత మేయర్ మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీ పూడికతీత నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, స్ట్రీట్ లైట్లు, బోర్లు పనిచేయడం లేదని విన్నవించారు. పార్కు నిర్వహణ అధ్వానంగా ఉందన్న ఆమె, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.