GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 3.85 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, పల్నాడు జిల్లాలో 3.80 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దీపం, ఉజ్వల, సాధారణ కనెక్షన్లు ప్రధానంగా ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు అనూహ్యంగా పెరిగాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 50 శాతం అదనపు బుకింగ్లు నమోదవుతున్నాయి.