ఓ విమానాన్ని పక్షి ఢీ కొంది. ఆ పక్షి పైలట్ ముందు వేలాడుతూ వీడియోలో కనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్‌ను పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Plane: విమాన (Plane) ప్రయాణికులను గమ్య స్థానం చేర్చాలంటే పైలట్, కో పైలట్ కీ రోల్. ఇద్దరు సమన్వయంతో వర్క్ చేసి.. ప్లైట్ సురక్షితంగా తీసుకెళ్లి.. దింపుతారు. కింద వీడియో ఒకటి చూస్తే పైలట్ డ్యూటీ ఎంత కష్టమో మీకు తెలుస్తోంది. అవును ఓ పైలట్ (pilot) పక్షి బారిన దాడికి గురయ్యాడు. మొహం అంతా రక్తం నిండి ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
విమానాన్ని ఢీ కొట్టిన పక్షి
ఓ పెద్ద పక్షి విమానం (flight) విండ్ షీల్డ్‌ను ఢీ కొంది. లోపలికి వచ్చి పైలట్‌ను దాడి చేసినట్టు ఉంది. పక్షి (bird) ఢీ కొనడం వల్ల అద్దంలోంచి వస్తోన్న గాలి విమానాన్ని కొంచెం కుదుపునకు గురిచేస్తోంది. ఏరియల్ వాలిటైల్ అనే పైలట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాడు. దీంతో అతడి ధైర్య సాహసాలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈక్వెడార్‌లో ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
రక్తపు మరకలు
పైలట్ (pilot) మొహం మీద రక్తపు మరకలు కనిపించాయి. అదీ పక్షి రక్తమో… అతనికి తగిలిన గాయాలో తెలియడం లేదు. వీడియో చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తనకు తెలిసిన పైలట్ ఒకరు కన్ను కోల్పోయారని విన్నానని పేర్కొన్నారు. ప్రమాదం చేసిన పక్షి ఆండియన్ కాండొర్ జాతికి చెందినది అని తెలుస్తోంది. దీని రెక్కల విసృతి 9 అడుగుల వరకు ఉంటుందట.