HYD: గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ ‘ఇన్స్టంట్ గ్యాస్ డెలివరీ’ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. తక్కువ ధర, వేగవంతమైన డెలివరీ అంటూ వచ్చే ఫేక్ లింకులను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక వెబ్సైట్లు, యాప్‌లనే వాడాలని సూచించారు.