KMR: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు సకాలంలో న్యాయం అందిస్తూ, పారదర్శకమైన సేవలతో ‘సిటిజన్ ఫ్రెండ్లీ’ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని SP రాజేష్ చంద్ర ఆదేశించారు. బుధవారం సాయంత్రం SP కార్యాలయంలో సెక్షన్ ఇన్‌ఛార్జ్‌ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విధుల్లో చురుకుతనం, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించినప్పుడే వృత్తిపరంగా రాణించగలరని తెలిపారు.