NZB: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై ముజాహిద్ తెలిపారు. నగరంలోని హైమదురకాలనీలో గుర్తుతెలియని భిక్షాటన చేసే వ్యక్తి అన్మోల్ గెస్ట్ హౌస్ వద్ద బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టమన్నారు. మృతుడికి కుడికాలు కట్ అయ్యి ఉందన్నారు.