ముందు నుంచి చెప్పినట్టే మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాతో మాసివ్ ట్రీట్ ఇచ్చేశాడు. దాంతో ఇది రవితేజ టైం అని అంటున్నారు. మాస్ రాజా కూడా ధమాకా తర్వాత మూడు వారాల గ్యాప్‌తో మరోసారి మాస్ జాతరకు రెడీగా ఉండండని అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లుక్ మరియు టీజర్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక ఇప్పుడు ధమాకా హిట్ జోష్‌లో వాల్తేరు వీరయ్య స్క్రీన్లు పగిలిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు. ఇప్పటికే ధమాకా థియేటర్లలో కొన్ని చోట్ల స్క్రీన్స్ చిరిగిపోయాయి. ఇక వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్‌తో కలిసి రవితేజ రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు. అందుకే వాల్తేరు వీరయ్యను తట్టుకోవడం కష్టమే అంటున్నారు. అంతేకాదు.. చిరంజీవి, రవితేజ కాంబోలో ఒక మాస్ మసాలా సాంగ్ ఉంటుందట. సినిమాలో ఆ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుందని చెబుతోంది చిత్ర యూనిట్. తెరపై రవితేజ ఒక్కడు కనిపిస్తేనే ఫ్యాన్స్ హంగామా ఇలా ఉంటే.. ఇక చిరుతో కలిసి రవితేజ కనిపిస్తే ఆ సందడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ కూడా అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట. అతి త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే జనవరి 8న, వైజాగ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా మాస్ రాజ ఫ్యాన్స్.