BPT: చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిస్పేట, శృంగారపేట ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని ఒక ఆటో, నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.