TG: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క పలు వినతిపత్రాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపిస్తున్న సోలార్ ప్లాంట్లకు కేంద్ర రాయితీల గడువును పొడిగించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.