SKLM: ఆమదాలవలస మండలం దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ హబ్ సెంటర్లో మూడు నెలల కంప్యూటర్ శిక్షణ ఉచితంగా ఇస్తున్నామని బుధవారం ప్రిన్సిపాల్ బీ. జానకిరామయ్య తెలిపారు. అర్హులైన వారు ఈనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి గుర్తింపు పత్రాలు అందిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 75690 77449 నంబర్‌కు సంప్రదించవచ్చున్నారు.