»Ed Has Arrested Dcs Former Chairman Venkatrami Reddy With Promoters
DCs former chairman Venkatrami Reddyని అరెస్ట్ చేసిన ఈడీ
బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్కు చెందిన డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ టి. వెంకట్రామ్రెడ్డి(Venkatrami Reddy)తోపాటు ప్రమోటర్లను కూడా ఈడి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (DCHL) ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు టి వెంకట్రామ్ రెడ్డి(Venkatrami Reddy), పికె అయ్యర్, వారి స్టాట్యూటరీ ఆడిటర్ మణి ఊమెన్లను ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. ఈ ముగ్గురిని మంగళవారం రోజంతా విచారించి సహకరించలేదన్న ఆరోపణలతో సాయంత్రం అరెస్టు చేశారు. వీరిని బుధవారం హైదరాబాద్లోని నాంపల్లిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ఈ క్రమంలో రూ.3,300 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ అటాచ్ చేసింది. డిసిహెచ్ఎల్(DCHL), దాని ప్రమోటర్లు వివిధ బ్యాంకుల నుంచి రూ.8,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. కానీ వాటిని మళ్లీ కట్టడంలో వీరి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేసింది. న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులోని కంపెనీ ఆస్తులను ఈడీ గతంలో అటాచ్ చేసింది. మరో ప్రమోటర్ టి వినాయక్ రవిరెడ్డి వ్యక్తిగత కారణాలతో మంగళవారం ఇడి విచారణకు హాజరుకాలేదు. అయితే 2015 ఫిబ్రవరి 15న మొదటిసారి డీసీ ఛెర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో వెంకట్రామిరెడ్డి రూ.357 కోట్ల మేరకు లోన్ తీసుకుని మోసం చేశారని కెనరా బ్యాంక్ ఫిర్యాదు చేసింది. బ్యాంక్ ఫిర్యాదుతో అప్పట్లో అరెస్ట్ అయ్యారు.