విశాఖ కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన రక్షణ, నివారణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి నేతృత్వంలో థియరీ, ప్రాక్టికల్ రూపంలో శిక్షణ ఇచ్చారు.