KNR: సైదాపూర్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో బుధవారం రోజున బీసీఐ ఆధ్వర్యంలో రైతులకు పురుగుమందుల వాడకంపై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీఐ అసిస్టెంట్ పీయూ మేనేజర్ రామారావు, ప్రాజెక్టు సమన్వయ కర్త సోని పాల్గొన్నారు. రైతులు పంట పరిశీలన చేసి, ఆర్థిక నష్ట పరిమితి దాటితేనే పురుగుమందులు పిచికారి చేయాలన్నారు.