KDP: అప్పుల బాధతో, మద్యానికి బానిసై సిద్ధవటం(మం) కడపాయపల్లెకు చెందిన కోటపాటి గోపాలయ్య(53) ఆత్మహత్య చేసుకున్నాడు. కడపలోని ఓ బేకరీలో పనిచేస్తున్న ఆయన, తరచూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. సోమవారం రాత్రి భార్యతో గొడవపడి, ఇంట్లోని గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.