మీ పిల్లలు ఏదైనా వస్తువును చూస్తే స్పందించేందుకు సమయం తీసుకుంటున్నారా? ఎదుటి వారి ముఖాలు, వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్ల ద్వారా చూసిన సంకేతాలు మెదడుకు చేరడానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ భాగాలు దెబ్బతినడం వల్ల CVI ముప్పు ఏర్పడుతుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత మెదడుకు గాయమైతే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.