మధ్యప్రదేశ్లో కలుషిత నీరు తాగి 6 నెలల బాలుడు మృతి చెందాడు. ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం ఇవ్వగా.. ఆ కుటుంబం దానిని తిరస్కరించింది. పదేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ పోతే.. ఆ డబ్బుతో పిల్లాడు తిరిగొస్తాడా అని నాయనమ్మ కన్నీరుమున్నీరైంది. ఈ ప్రాంతంలో కలుషిత నీటి వల్ల ఇప్పటికే 15 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.