ADB: ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ, ఏటీసీ కళాశాలను శుక్రవారం సర్పంచ్ అనిత శ్రీనివాస్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న 6 కోర్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. అలాగే యువత సాంకేతిక విద్య వైపు పయనించాలని దానితో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.