ASR: డుంబ్రిగూడలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ (ఎంపీసీ) మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. భవాని తెలిపారు. 6వ తరగతిలో 40, ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 40 సీట్లు ఉన్నాయని చెప్పారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.