ELR: చాట్రాయి(m)బూరుగుగూడెం గ్రామము శివారులో పేకాట శిబిరం పై గురువారం పోలీసులు దాడి చేసి 17 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 21,000 నగదును, 19 మోటార్ సైకిల్స్లను స్వాధీనం చేసుకుని వారిపై చాట్రాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆర్థికంగా ఇబ్బందులను కలగజేసే జూద క్రీడలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.