MLG: వాసంపల్లి మహేశ్వరీకి పురిటి నొప్పులు రావడంతో.. భర్త వాసంపల్లి నవీన్ 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు పైలెట్ రవీందర్, ఈఎంటీ మహేశ్వరీ హుటాహుటిన గూర్రేవుల గ్రామానికి చేరుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గం మధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ మహేశ్వరీ సదురుమహిళకు ప్రసవం చేసింది.