కృష్ణా: ఉయ్యూరులోని లిటిల్ ఫ్లవర్ ది లీడర్ స్కూల్లో రిలీజియస్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మన దేశంలోని విభిన్న భాషలు, మతాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆకట్టుకునే వేషధారణతో ప్రదర్శనలు ఇచ్చి ఊతేజపరిచారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతిని తమ ప్రతిభతో చాటి చెప్పారు.