చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్లు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా.. ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.