HYD: రవీంద్రభారతిలో ముదిరాజ్ సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సన్మాన సభ సందర్భంగా ముందుగా పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సామాజికవర్గ నాయకులు పాల్గొన్నారు.