TG: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. రేపటితో ముగియనున్న అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కాగా, గత 22 నెలలుగా అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తూనే ఉంది. ఈసారి గడువు పొడిగించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.