GDWL: అయిజ పట్టణంలో పసిపిల్లలు ఇంటి బయట ఆడుకోవాలంటేనే భయం వేస్తుందని కుక్కలు, కోతులు చిన్నారులను వేటాడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం తగదు అని బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వీటిపై చర్య తీసుకోవాలన్నారు.