MDK: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆపరేషన్ స్మైల్ 12 కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి పునరావాసం కల్పించాలన్నారు.