NZB: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ రోడ్డులో విజయవాడ సైకతశిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ ఇసుకతో శిల్పాలను రూపొందించారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ అగర్వాల్, స్పార్క్ మీడియా లావణ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఈ ఇసుక దశావతారాల ప్రదర్శనను ప్రారంభించారు.