KRNL: నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) పరిధిలోని రైతులకు రుణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ MLA బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23 మంది రైతులకు మొత్తం రూ.1.13 కోట్ల విలువైన రుణాలను చెక్కుల రూపంలో అందజేశారు. రైతుల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.