E.G: ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు MLA, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.