NLR: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 22వ విడతగా రూ.18,640 కోట్లను ఈ నెల 13న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శాస్త్రవేత్త డా. ప్రసాద్ బాబు బుధవారం తెలిపారు. చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.