విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సుస్థిర రసాయన శాస్త్రం-2026” అంశంపై జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో సుస్థిర రసాయన పరిశోధనల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.