సంతనూతలపాడు మండలం మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బుధవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. దళారులతో ఇబ్బంది లేకుండా రైతులు నేరుగా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, అధికారులు, తదితర నాయకులు పాల్గొన్నారు.