NZB: వికారాబాద్లో నేటి నుంచి పది రోజుల పాటు నిర్వహించే జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరానికి ఉమ్మడి NZB జిల్లా నేతలు హాజరయ్యారు. NZB జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, KMR జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీనియర్ నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు.