E.G: మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 14 ఏళ్లు దాటిన బాలికలు తప్పనిసరిగా ఈ టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు.