Vimanam movie review: విమానం మూవీ రివ్యూ..ప్రతి తండ్రి కన్నీరు పెడతారు!
సముద్రఖని(samudrakhani), అనసూయ భరద్వాజ్ (Anasuya), మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా విమానం (Vimanam Movie). ఈ మూవీ నేడు (జూన్ 9న) తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదలైంది. శివప్రసాద్ యానాల దర్శకత్వం (Director Shivapraad Yanala) వహించిన ఈ చిత్రం స్టోరీ ఎంటీ, ఎలా ఉంది అనేది ఇప్పుడు చుద్దాం.
సినిమా: విమానం రచన & దర్శకత్వం: శివ ప్రసాద్ యానాల నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్ నటీనటులు: సముద్రఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, నాన్ కడవుల్ రాజేంద్రన్, మీరా జాస్మిన్ సంగీతం: చరణ్ అర్జున్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వివేక్ కాలెపు ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ డైలాగ్స్: హను రావూరి ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి సహ నిర్మాత: వీణా కొర్రపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హనుమంతరావు బోయపాటి రన్‌టైమ్: 2 గంటల 2 నిమిషాలు విడుదల తేదీ: జూన్ 9, 2023
జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ‘విమానం’(Vimanam). ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అలరించేందుకు ఈరోజు(జూన్ 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో సముద్రఖని(samudrakhani), అనసూయ(Anasuya), మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. శివప్రసాద్ యానాల రచన, దర్శకత్వం చేశారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఈ మూవీ ఎలా ఉంది? హిట్టా? ఫట్టా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కథ
బస్తీలో ఉండే తండ్రీ వీరయ్య(samudrakhani), కొడుకు రాజు(మాస్టర్ ధ్రువన్)ల జీవనం గురించి ఈ చిత్రంలో చూపిస్తారు. చాలీ చాలని సంపాదనతో జీవించే అలాంటి పేద కుటుంబంలో ఉండే పిల్లాడి(మాస్టర్ ధ్రువన్)కి విమానం ఎక్కాలనే కోరిక కలుగుతుంది. మరోవైపు తండ్రి(సముద్రఖని) అవిటితనంతో బాధపడుతూ ఓ సులభ్ కాంప్లెక్స్ నిర్వహిస్తూ దాని ద్వారా వచ్చే సంపాదనతో జీవిస్తారు. ఇంకోవైపు బస్తీలో వేశ్య వృత్తి చేస్తూ సుమతి(అనసూయ) జీవనం కొనసాగిస్తుంది చెప్పులు కుట్టే వ్యక్తిగా కోటి(రాహుల్ రామకృష్ణ) అనసూయను లవ్ చేస్తాడు. ఆటోడ్రైవర్ డేనియల్(ధన్ రాజ్) పాత్రలు ఉంటాయి. ఆ క్రమంలోనే వీరయ్య కుమారుడు రాజుకు ల్యుకేమియా బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి క్రమంలో తండ్రి ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ? విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి తండ్రి ఏం చేశాడు? చివరికి ఫ్లైట్ ఎక్కారా లేదా? అసలు వేశ్యతో లవ్ స్టోరీ ఏంటి అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
ఈ చిత్రంలో తండ్రి, తన కొడుకు కోరిక కోసం విమానంలో ప్రయాణించాలనే కలను నెరవేర్చడానికి ఏదైనా చేయడానికి సిద్ధమనే విధానాన్ని భావోద్వేగంగా చూపించారు. మొదటి భాగంలో అంగ వైకల్యంతో బాధపడే తండ్రి అందుకోసం ఏం చేశాడు. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. తండ్రి, కుమారుల జర్నీ, రోజువారీ జీవనం, మధ్యలో ఎమోషనల్ సీన్స్ ను చక్కగా చూపించారు. కథ కాస్త రొటీన్‌గా అనిపించినా, దర్శకుడు శివ ప్రసాద్ యానాల తీసిన కొత్త తరం సెటప్, రియలిస్టిక్ విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో కుమారుడి కోరిక కోసం తండ్రి పలు సమస్యలను ఎదుర్కొవడం, జైలుకు వెళ్లడం వంటీ కీలక ట్విస్టులను చూపించారు. దీంతోపాటు వేశ్య సుమతిని ప్రేమించే కోటి. తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే చివరిగా ఆమె కన్నీరు పెట్టుకునే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక చివరి 15 నిమిషాలు మాత్రం ఈ మూవీ చూసిన ప్రతి తండ్రి కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఒకానొక క్రమంలో తప్పకుండా కన్నీరు పెట్టుకుంటారు. ప్రతి తండ్రి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.
ఎవరెలా చేశారు
ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ వీరయ్య(సముద్ర ఖని) (Samudrakhani) అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే తండ్రి పాత్రలో నటించారు. ఒక విధంగా చెప్పాలంటే సముద్రఖని ఈ చిత్రంలో తన బెస్ట్ లెవల్ ఫర్ఫామెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. కుమారుడిని చూసుకునే విధానం, డైలాగ్ డెలివరీ, ఏడ్చే సీన్లతోపాటు అనేక చోట్ల లీనపై యాక్ట్ చేశారు. ఇక పిల్లాడి క్యారెక్టర్లో మాస్టర్ ధ్రువన్ అమాయకత్వంతో ఆకట్టుకునే విధంగా నటించారు. మరోవైపు వేశ్య క్యారెక్టర్లో అనసూయ కూడా తన బెస్ట్ ఇచ్చింది. దీంతోపాటు రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్, మీరా జాస్మిన్ సహా పలువురు వారి క్యారెక్టర్ల మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాలు
ఈ చిత్రంలో సాంకేతిక అంశాలను మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ చక్కగా చూపించారు. విమానం ఎగిరే సీన్లతో పాటు పలు సన్నివేశాలను ఉత్కంఠభరితంగా చూపించారు. దీంతోపాటు మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అని చెప్పవచ్చు. బీజీఎం కూడా బాగుంది. ఇక శివ ప్రసాద్ యానాల రచన, దర్శకత్వం బాగుంది. కథలో ప్రతి సన్నివేశంను లింక్ చేయడంతోపాటు స్క్రీన్‌ప్లేలో చక్కగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.