VSP: రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా కాకుండా అధికార టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో బాధితురాలికి న్యాయం చేయకుండా తిరిగి ఆమెపైనే కేసులు పెట్టడం పోలీసుల పక్షపాతాన్ని చూపుతుందని విమర్శించారు.