వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు ధర్మేంద్ర సాగర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా నూతన డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డిని ఇవాళ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ధర్మేంద్ర సాగర్ కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ సాగర్, మండల నాయకులు కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.