తిరుపతి: తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వసతి గదులను గురువారం తనిఖీ చేశారు. ముందుగా కర్ణాటక అతిథి భవనంలోని గదులను పరిశీలించారు. అనంతరం టీటీడీ నారాయణగిరి గెస్ట్ హౌస్ గదులను తనిఖీ చేశారు. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు అందించేందుకు తనిఖీలు చేశామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రిసెప్షన్ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.