VZM: కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో 108 సార్లు హనుమాన్ చాలీసా గురువారం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏకధాటిగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆనంతరం సాయి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.