సత్యసాయి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 17 వరకు పొడిగించినట్లు చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం ధర్మవరంలో మాట్లాడిన ఆయన, జిల్లాలో కార్యకర్తలు, అభిమానులు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గడువు ముగిసేలోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.