PPM: సీతానగరం మండలం గాదెలవలస నుంచి ఏగోటివలస వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలకు రోడ్లు లేకుండా పోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.