సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న రాయదుర్గం-తుమకూరు రైల్వే లైన్ పనులను ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు బుధవారం పరిశీలించారు. రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి రైళ్ల రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.