KRNL: నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ఈ నెల 17న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా నియమించారు. ప్రభుత్వ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ బుధవారం జీవో 284 జారీ చేశారు. కర్నూలు నగర కార్పొరేషన్ కమిషనర్ పి.విశ్వనాథ్‌ను నందికొట్కూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.