ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆధార్(Aadhaar) కీలకమైన డాక్యుమెంట్(Document). ప్రభుత్వ పథకాల దగ్గరి నుంచి బ్యాంకు లావాదేవీల వరకూ, రైల్వే ప్రయాణాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. ప్రతి ఒక్క పనికి ముఖ్యమైన గుర్తింపు కార్డు(Identity Card)గా ఆధార్ కార్డు చలామణి అవుతోంది. అయితే ఇవన్నీ సజావుగా సాగాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఏ సంక్షేమ పథకం అందాలన్నా వారు ఆధార్ ను మిగిలిన వివరాలతో అనుసంధానించాల్సి ఉంటుంది.
ఆధార్(Aadhaar)లో తప్పులు లేకుండా సరిచేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. లేకుంటే చాలా పనుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు(Aadhaar Card) తీసుకుని పదేళ్లు అయిన వారు కచ్చితంగా తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి యూఐడీఏఐ(UIDAI) కూడా పలుమార్లు సూచనలు చేసింది.
ఈ మధ్యనే అందరికీ ఉచితంగా ఆధార్ అప్డేట్(Aadhaar Update) చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రకటన చేసింది. జూన్ 14వ తేది వరకూ ఆధార్ ను ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత మాత్రం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 14 తర్వాత ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు కనీసం రూ.50 చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. మే నెలలోనే గడువు ముగిసినా మరొక్కసారి ఆధార్ అనుసంధానానికి గడువు ఇవ్వాలని వినతులు అందాయి. దీంతో యూఐడీఏఐ(UIDAI) ఆ గడువును జూన్ 14కు పొడిగించింది.