»Breaking Six People Died After Falling Under The Train Due To Strong Winds
Breaking: మరో విషాదం..ఈదురగాలి వల్ల రైలు కింద పడి ఆరుగురు మృతి
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
ఒడిశా(Odisha)లో మరో ఘోరం జరిగింది. ఝాజ్పూర్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆరుగురు దుర్మరణం(6 Died) చెందారు. గూడ్స్ రైలుకి చెందిన ఓ బోగీ కింద ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లో గత కొంత కాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు(Goods Train)ను ఒక ట్రాక్ పై ఉంచారు. కార్మికులు ఆ ప్రాంతంలో మరమ్మతులు చేస్తుండగా ఈదురుగాలులు ఎక్కువయ్యాయి. వర్షం(Rain) కూడా జోరుగా పడింది. దీంతో వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కిందకు కార్మికులు వెళ్లారు.
ఈదురు గాలులు(Heavy winds) బలంగా వీయడం వల్ల రైలు బోగీలు కాస్త ముందుకు కదిలాయి. దీంతో రైలు కింద ఉన్న ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరు గాయాలపాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు వైద్యం అందిస్తున్నారు.
వర్షం(rain) నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ(Goods Train) కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారని, బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.