AKP: రాంబిల్లి మండలం పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం 38వ రోజుకు చేరుకున్నాయి. గత ఎన్నో సంవత్సరాల నుంచి మామిడి, జీడి తోటలను సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. తమ భూములు లాక్కుంటే రోడ్డున పడతామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.