AP: పెన్షన్లపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రెండున్నర లక్షల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మేం 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తే.. ఇప్పుడు 60 లక్షల మందికే పెన్షన్లు ఇస్తున్నారు. మరో 7 లక్షలకు పైగా పెన్షన్లు కోత పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా 25 వేల పెన్షన్లు కోత పెడుతున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు’ అంటూ విమర్శించారు.