VSP: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఈ నెల 13న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అజెండా సిద్ధం చేసి సభ్యులకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈనెల 17తో పాలకవర్గం ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం. గతంలో పెండింగ్లో ఉన్న కొన్ని అంశాలు, బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.